Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డేపల్లి మల్లేశము
9014206412
బతికి బతికించే బతుకమ్మ సాక్షిగా
మహిళల జీవితం అంధకారం అవుతుంది
స్త్రీ జీవితం ప్రశ్నార్థకం అవుతుంటే!
ప్రకృతి ఆలిగి చిన్నబోయింది
వరుస ఘటనలతో దశాబ్దాలుగా
అత్యాచార భారతంలో నేలరాలిన కుసు
కుసుమాలెన్నో?
దిగజారుతున్న విలువలకు నిలువుటద్దం
నేర స్వభావం మృగత్వం గా మారితే
పెంపకం ,సావాసం లోని దోషాలు
సామాజిక ,రాజకీయ ,ఆర్థిక కారణాలకు
స్త్రీలు పిల్లలు బలవుతున్నారు.
నిమ్న వర్గాల పై కులం విసిరిన పంజా
ఆధిపత్య భావజాలంతో రాక్షసత్వం
మడుగులో దిగబడిన వాహనములా
దీనంగా తల్లి ,చెల్లి చేసే మృత్యుఘోష
మద్యం ,మత్తు, అశ్లీల చిత్రాలు కారణం కాదా!
విలువల విద్య లేమి..
అంతరాలు అసమానతల నిచ్చెనమెట్లు
మదాంధకారంతో మానవతనుచెరిచితే
బతుకమ్మ ఎలా జీవిస్తుంది!
బతుకులను ఎలా పరిరక్షిస్తుంది?
నిమ్నకులాల పై కాటేస్తున్న అగ్రవర్ణ ధోరణి
అంతమైతే నేనే బయట పడేది
ప్రజా చైతన్యం పెల్లుబికి దహించివేయాలి
యువత తమ తల్లి ,చెల్లిని కళ్ళారా చూస్తే
ఆడ తల్లుల పై ఆగడాలు అంతం చేయొచ్చు
శిక్షలు పరివర్తన కోణంలో అమలు చేస్తే!
తల్లులకు రక్షణ దొరుకుతుంది.
నీచ మృగాల నిగ్గు తేలుతుంది
తల్లుల పై ఆగడాలకు అంతం అది.
నీ చూపు వారిపట్ల మరణశాసనం కావాలి!
తల్లి రాబోయేది గెలుపు నీదే.
ఓటమి మృగాలది, నిర్వాకుల ది
ఓ యువత ఒక్కసారి ఆలోచించు!
అపనిందల పాలు ఎందుకు అవుతావు.?
మహిళా లోకాన్ని బ్రతికించు. బ్రతుకు!