Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలా గంగా దేవి
మేడ్చల్
స్త్రీ యావత్ జాతికే గర్వకారణం
స్త్రీ ప్రపంచానికే మూల కారణం
స్త్రీ ని చూసి కళ్ళు కుడుతున్నాయి
నేటి సమాజం లో
ఎక్కడ స్త్రీ లు పూజింపబడతారో
అక్కడ దేవతలు కొలువుంటారని అంటారు
పుడుతూనే పాలకేడ్చి
పుట్టి జమ్పాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
కుటిల కామ నిచులై
మా పాలిట కిచకులై
ఆడ బిడ్డల ఆడు బిడ్డల శత్రువులై మారితే
మీరు చేసిన దొర్ఝాన్యానికి
కొందరు వత్తాసు పలికితే
ఊరుకుంటుందా మా స్త్రీ శక్తి
గమనించకుందా మా యువ శక్తి
ఒరేయ్ కామందులరా
పారాహుషార్ మీ లాంటి వాళ్ళు
ఎక్కడ ఉన్నా ఎ పొదల్లో దాక్కున్న
గర గర ఈడుచుకొచ్చి
చీల్చి చెండాడే ఆది శక్తులం
ఓపిక ఉన్నంత వరకే మేం
స్త్రీ ముర్తులం
ఓపిక నశిస్తే భద్ర కళిలం
తస్మాత్ జాగ్రత్త