Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మర్రి జయశ్రీ
మోత్కూర్, యాదాద్రి జిల్లా
9948945567
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో
అక్కడ దేవతలుంటారన్నది ఆర్యోక్తి
స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే
భారతీయ సంస్కృతిలో
పర స్త్రీలను మాతృ సమానంగా భావించే దేశంలో
దిగజారిపోయిన మానవతావిలువలు
పెరుగుట విరుగుట కొరకేనేమో
సాంకేతికాభివృద్దినే కాంక్షిస్తూ
సంప్రదాయాలను వదిలేస్తున్న హీన పరిస్థితి
ఆడపిల్ల కనిపిస్తే చాలు
పొంచి ఉండే గుంటనక్కలు
కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగాలెన్నో
పసిమొగ్గలని,పండు ముదుసలని భేదాలు మరచి
మానవత్వమే మరచిపోయి
చేసే వికృత చేష్టలకు
బలియైపోయిన సబల లెందరో
అఘాయిత్యాలెన్నో జరుగుతున్నా
చేష్టలుడిగి తలదించుకునే సభ్యసమాజం
చట్టాలు చుట్టాలై
కామాంధుల కాపు కాస్తుంటే
రక్షణ ఎక్కడ ఓ వనితా!
నీకు నువ్వే రక్షణ
చైతన్య శక్తివై ఆత్మస్థైర్యంతో
అడుగు ముందుకు వెయ్యి
అపర కాళికలా దుష్టుల అంతమొందించే
ఆది పరా శక్తిలా కదులు
కామాంధులను నీ రక్షణ కవచాలతో అంతమొందించు