Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశోక్ దుర్గం
8106709871
కొమురం భీం ( ఆసిఫాబాద్ )
ఎవరో...!
నన్ను ముండ్లతో గుచ్చుతున్నట్టు
ముండ్లపై పడుండబెట్టుంది
నా దేహమంతా..! వాతలెట్టి
కరుడుగట్టిన కత్తితో
రెక్కలు నరికినట్టుంది.
తుప్పు పట్టిన ఇనుప రాండ్లకు
తారు పూసినట్టు
పూలతో అల్లి
ఇసుక దినుసులపై పరుండ పెట్టినారు
ఎందుకంటవ్ ?
ఎవరో...!
రాళ్ళు రువ్వినట్టు
కచులంతో నన్ను తొక్కిస్తూ
నా చుట్టూ
సుడిగుండంలా తిరుగుతుంది
ఎవరంటవ్ ?
నా కాళ్ళు చేతులను
ముండ్లకంచెతో గట్టి
ఎండుతున్న బాయిలో
కారం జల్లుతూ..!
ఎంగిలప్పలా మురుస్తు
ముగబోయిన గొంతుకను చేస్తున్నరెవరో..?
వదలండి వదలండంటూ
ఒక్కసారి గట్టిగా అరవాలనిపిస్తంది.
కానీ, శక్తి లేదు
కొండ నాలుక ఎండిపోయింది.
గద్దలు కాకులు పీక్కుతింటున్నాయి
నా చర్మం జూసి
ఎర్రలు పాకుతున్నాయి
రాక్షస బళ్ళులు రక్తం తాగుతున్నాయి
నా కండలను
తోడేళ్ళు లాగుతున్నా
బొక్కలో దాగిన
ఎండ్రికాయాను దీసి
చితి మంటలపై కాల్చినట్టు
మృగాలు ఖడ్గమృగాల్లా
నా మీద పడి కాల్చుకు
తింటున్నరెవరో...?
నా రెక్కలు విర్చి
చేతికి సంకెళ్ళేసి
చిత్ర హింసలెడుతు
పంజరంలో బంధించి
డొక్క దీసి డోలు వాయిస్తుందెవరో...?
కరుడు గట్టిన కృర మృగాల్లా
చేతిలో బలిదానమైతిని.
కాలం కాళ్ళు బట్టిన
రక్షించండీ అంటూ..!
సకల దేవతలను గోరిన
కనికరించకుండా కాళ్ళు చేతులు గట్టి
వన్యమృగాలకు దానమేసిందెవరో..?
ఓ దేవ ...!
ఎందుకీ జన్మ
జాలి దయలేని చెత్తలో పడేశావు.