Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
హైదరాబాద్, 9440720324
ఎక్కడుంది సాధికారత
ఎక్కడుంది సమానత్వం
అవని నుండి అంతరిక్షంలోకి
దూసుకుపోయినా
అతివకు ఆగని ఆరళ్ళు అగచాట్లు
పడతికి పడరాని పాట్లు!!
ఆరేళ్ల పిల్లనుండి అరవై ఏళ్ల ముసలి అయినా సరే
అమ్మాయి కనిపిస్తే చాలు
ఆవురారనుకుంటూ
చొంగ కార్చుడే!!
రీతి లేదు నీతి లేదు
ఆగమవుతున్న జీవితాలు
తోటి మనిషి చేసే
అఘాయిత్యాలు!!
వినబడలేదా ఆడపిల్ల ఆక్రన్దన
కనబడలేదా ఆడబిడ్డ ఆవేదన
మానవత్వం చూపవా!!
అమ్మ లేక జీవితం లేదు
ఆడదే ఆధారం
కాంత కామ వస్తువు కాదు!!
అతివా మతితో మలుచుకో
జీవితగమనం దిద్దుకో
ఆదరిస్తే అమ్మవైనా
ప్రమాదమొస్తే ప్రళయం సృష్టించు
కాలయముడిలా
విజృంభించు
ఆత్మ స్థైర్యం నీ ఆయుధంగా మున్ముందుకు సాగు!!