Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుమ్మడి సాంబమూర్తి
7702838118
ఆరాధ్యదేవతలుగా పూజించుదేశాన
పుడమి తల్లిగా భావించు రాజ్యాన
రాక్షస మనసు ఎక్కడినుండి వచ్చెనో
కడుపుతీపిని మరిచిన
కషాయితనం ఎలాగ చేరెనో
అర్ధనారీశ్వరునిగా గుర్తించిన మనసున
ఈ గూడు కట్టుకున్న నేర విష కోరలు ఎక్కడివి
కాలం మారుతోంది అని చెప్పి!
మాట్లాడుకుని తనపనితాను చేస్తున్న కాలం పై నెట్టి
రాక్షస క్రీడకు తెగ బడుతున్నది
మానవత్వం లేని మనిషి గుణం
ఆ దారిలో వెతికినా ఆలోచిస్తే కనిపించదా అమ్మతనం
గుడులు కట్టి గొప్పగ చెప్పి
గుడి వెనుక గోతులు తవ్వినట్లు
కారణ జన్మాన్ని కబంధ హస్తాల తో ప్రాణం తీయగా
గొప్ప సంస్కృతికి కళంకం కదా మరి
అమ్మని అంగడి సరుకులా చూస్తూ
ఆటబొమ్మల వలె ఆడుకుంటున్నారు
అత్యాచారం నేరమని తెలిసి అదే చేస్తున్న మానవా
మైకంలో పడబోకు మత్తును వీడు
అమ్మని కాపాడుకుందాం బ్రతుకమ్మని బ్రతికిద్దాం
అవనిగా! అవనిని ఆదర్శంగా నిలుపుదాం