Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాణాల త్రివేణి , ఖమ్మం
9704053380
అమాయకులైన ఆబలాలను అగౌరవపరిచి అణిచివేస్తున్న
మానవత్వం లేని క్రూర మృగాలను అంతమొందించాలి
ఆనాడు నిండు సభలో ద్రౌపది అవమానపరిచ బడినప్పుడు మహా యోధులు సైతం
నిశ్చేష్టులై చూశారు తప్ప నోరు మెదపలేదు
ఈనాడు అధికారులు ఆడపిల్లలకు అండగా నిలవగల రా
కాపాడవలసిన వారే లంచాలకు పీడితులై దోషిని నిర్దోషిగా మలి చేస్తున్నారు
చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కామాంధుల చేతుల్లో కీలుబొమ్మల వుతున్నారు
మేలుకో సభల మేలుకో నీలో దాగిన శక్తిసామర్ధ్యాలను మిలితం చేసి
ఎదురు తిరిగి పోరాడితే నీకు నువ్వే మేటి నీకు ఎవ్వరూ లేరు సాటి
ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి వంటి వీరవనితలను కన్న దేశం మనది
ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటే
ఇంతకీ ఇంతకు పెరిగే అత్యాచారాలు మానభంగాలు తప్ప ఏముంటుంది
నువ్వు ఒక్కసారి కళ్ళెర్ర చేస్తే పెచ్చరిల్లుతున్న పురుష పిశాచులు పరుగులెత్త సిందే
వంటింటిని విడనాడి బయట ప్రపంచంతో పోరాడు
ఎన్ని చట్టాలు ఉన్నా నీ లోని ధైర్యమే నీకు చుట్టం అవుతుంది
నేటి మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నప్పటికి
దుర్మార్గుల ఆగడాలకు అకృత్యాలకు బలి అవుతున్నారు
మగువ లేనిదే జగమే లేదన్నమాట మరువకు
తల్లిని చెల్లిని ప్రేమించిన ట్లే ఇతరులను గౌరవించి శ్రీ సమాజాన్ని రక్షించు