Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిత నామిని
ఆకాశంలో సగం అంటూనే
అరచేతిలో వైకుంఠం చూపి
వంటింటి కుందేలంటారు
అంతరిక్షంలో దూసుకుపోతున్న
అభివృద్ధితో ఇంటా బయట గలిచేస్తున్నా
ప్రపంచాన్నే ఏలే శక్తి సామర్ధ్యాలున్నా
వివక్షతతో వెనక్కు నెట్టేస్తున్నారు
అయినా
మగువ మమకారానికి చిరునామా నీ జన్మ
శాంతి సహనం త్యాగం నీ మరో రూపాలు
కడుపు కోత కోసిన ప్రాణం పోసే శక్తి నీది
కామవాంఛతో నీ మానప్రాణాలతో
చెలగాటం ఆడే దుష్టులను
సహస్ర ఫణివై అగ్నిశిఖలను విరజిమ్ముతు అంంతం చేయి
దుర్మార్గుల కసి చూపులకు భయపడక
నీ కను చూపుల లావాతో కాల్చివేయి
అనురాగాన్ని అపహాస్యం చేసే మృగమదలములను
అగ్గిసెగై దహనం చేసి
బతుకమ్మ బతుకు
సృష్టికి ప్రతిసృష్టి చేసే ధీరమాతవై బతుకమ్మ బతుకు