Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పరి సత్యనారాయణ,
రేచిని,తాండూరు,మంచిర్యాల.
9949709208.
సృష్టిలో ఆడబిడ్డకైన మొగ బిడ్డకైన జన్మనిచ్చింది అమ్మ.
అమ్మకొడక అమ్మకొడక అధరించవేమిరా అమ్మనై అడుగుతున్న.
నాదు రక్తం నీదు ఒంట్లో ప్రహించకపోయిన నారూపం నీలో లేకపోయిన .
నీ అమ్మలాంటి దానినై అడుగుతున్న అధరించి మమ్ము బ్రతికించవేమిరా...
పేగుబందంతో కన్నది మీ అమ్మ పొత్తిచించుకొని పెంచింది
మీ అమ్మ నాలోన కూడ మీ అమ్మను చూడవేమిరా...
పరస్త్రీ అంటే మీకు ఎందుకు లోకువ మమ్మల్ని కామంతో చూసినప్పుడు
మీ అమ్మ అక్క చెల్లి మాలోన మీకు కనిపించ లేదా.
వికృత చేష్టలతో మమ్ములను బలి పశువులను చేస్తూ
మాప్రాణాలను తీస్తున్న మీమ్మల్ని ఏమనుకోవాలి.
మీకు రాఖీ కట్టిన మీ తోబుట్టువులను రక్షిస్తారు
మీ రక్త బంధానికి కడదాక తోడుండి కాపాడుకుంటారు
మేమి పాపం చేశాం మమ్మల్ని ఆగం చేసి చంపుతున్నారు.
మీ చెల్లిలాగనో మీ అక్కలాగనో మీ అమ్మలాగనో
మమ్మల్ని చూసి అధరించావేమిరా ఒ అమ్మ కొడక.
బతుకమ్మ గౌరమ్మ బతుకు తల్లి అని మమ్మల్ని
నీ తల్లి అనుకొని పూజించవేమిరా...
అమ్మ కొడక అధరించి మమ్ము రక్షించుమురా
మీ అమ్మ పాల ఋణం తీర్చుకోరా మా అమ్మ కొడక.