Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కుదమ తిరుమలరావు
రాజాం, శ్రీకాకుళం జిల్లా.
పిల్లా తల్లీ ముసలీ ముతకా మనవళ్ళంతా ఉత్సాహంగా
మాలలతో పూబంతులతో ప్రదక్షిణంగా పాల్గొనగా
పల్లే పట్నం గల్లీ గట్రా పులకరించేటి వేడుకగా
కొండా కోనా చెరువూ తరువూ మురిసిపోయేటి కానుకగా
బతకడమన్నది అన్నిటి కంటే మహోన్నతంబగు గొప్ప కళ
బతుకమ్మ దేవత అందరి బతుకుల్లో మెరిపించేను తళతళ
ఎలకోయిల పాటలమ్మ
మయూరాల నాట్యమమ్మ బతుకమ్మ
చిట్టిచిలక పలుకులమ్మ
మేఘమిచ్చు చల్లనమ్మ
బతుకమ్మ
పూలదండలు రంగవల్లులు పుడమినంతటికి ఆనందం
సువాసనలతో గుబాళింపుల నోములు నోచే వైభోగం
జీవరాసులన్నింటికీ ప్రకృతియే ఆది దైవం
ఆ ప్రకృతిని పూజించుటే బతుకమ్మ సంబురం
వాడవాడలా వెల్లివిరిసేటి ప్రకృతి శోభ బతుకమ్మ
సుఖశాంతులతో వర్ధిల్లమని దీవెనలిచ్చే బతుకమ్మ
దసరా సరదా దశదిశలంతా ఐక్యంతోడ గౌరమ్మ
విజయదశమితో జేఘంటలనూ మ్రోగించేటి దుర్గమ్మ
బతుకమ్మ ఆశీస్సులతో బతుకులన్నీ నడిచేలా నిండుగా
ప్రకృతమ్మ ప్రశాంతమ్మయై బతకనివ్వాలి భోగాలతో మెండుగా