Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింగళి.భాగ్యలక్ష్మి,బ్రాడిపేట, గుంటూరు, 9704725609
భారత్ అంటే రేప్ లు అత్యచారాలు మానభంగాలేనా?
బయటకు వెడితే పోకిరీల బెడద
ప్రేమోన్మాదుల బరితెగింపులు
అత్తారింట్లో గృహహింస
మరి పుట్టింట్లో అయినా ఆడపిల్లలకు
భద్రత వుందా అదీ లేదు.
కనురెప్పపాటేస్తే ఇక కనుపాపకి దిక్కెవరు?
మానవత్వం మంటగలిసిపోతుంది.
పెంపకం లోపమా? పెడదారి పోకడల ఫలితమా?
కారణం ఏదైనా నీ చానికి ఒడిగడుతున్నారు.
వావి వరుసలు మరిచి హీనంగా ప్రవర్తిస్తున్నారు.
మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా
అన్న అనుమానం కలుగుతుంది.
దీనికి మొదలే కాని అంతం లేదా?
చట్టాలు చేసినశీత మాత్రాన నేరాలు తగ్గు ముఖం పడతాయా? అంటే లేదు.
మృగాళ్లు రెచ్చి పోతూనే వున్నారు
లైంగిక దాడులకు తెగిస్తూనే వున్నారు.
అడుగడుగునా పొంచివున్న గుంటనక్కలు
చిన్నారుల జీవితాలను చిదిమేస్తూనే వున్నారు.
చట్టాలు చేయడం కాదు
వాటిని కఠినంగా అమలుచేసినపుడే
బాధితులకు న్యాయం జరుగుతుంది.