Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా. మాడ పుష్పలత
మహబూబ్ నగర్
9885454409
సమాజ సరళికి సార్థక్యం లోపించిన వేళ
సహజీవికి సానుభూతి లోపించినవేళ
సంఘవిద్రోహక చర్యలు ప్రబలిన వేళ
సంస్కృతులకు తిలోదకాలు ఇచ్చిన వేళ
మానవత్వాన్ని మంటగలిపిన మనుగడకు లేదర్థం
మృగాళ్ళమారణహోమంలో మంచితనంమృగ్యం
వావీ వరుసలకు పడుతోంది పటిష్ఠమైన తాళం
కర్కశాల కడలిలో కొట్టుకుపోతోంది కన్యల కాలం
మతిహీనుల ఈ మహిలో మమతలౌతున్నాయిహీనం
మా నవజీవనంనాణ్యత లోపించి అవుతున్నదిహేయం
వికారపు సుడిలో చిక్కినది వైవస్వత మనువు.
కాలవైపరీత్యానికి కళ్ళెమేయలేదు కామధేనువు
కనికరంలేని ఓ మనిషీ!.....
కనిపించనిదేవుళ్ళనెందుకు మ్రొక్కేవు?
కని పెంచిన వారినెందుకు విస్మరించేవు?
పైశాచిక ప్రాబల్యాన్ని మార్చలేడు ఏభృగువు.
ఎప్పుడు ఈ స్త్రీల యుగానికి ప్రారంభం!
ఎప్పుడు ఈ హత్యాచారాలకు అంతం