Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జోగు కృష్ణయ్య
నానక్ నగర్, యాచారం మండలం
9441864640
ఓ...కామంధుల్లారా..!
ఎక్కడున్నారు మీరు..?
మద్యం మత్తుల్లోనా,ఆసిడ్ దాడుల్లోనా..?
లేకా..! నరరూప రాక్షసుల మందల్లోనా..?
మానవీయతకు మారుపేరు
మన భారతావని
ప్రపంచానికే చాటిచెప్పిన
సంస్కృతి సంస్కారం మనది
ఆడది వున్నది పిండుకోవడానికి పండుకాదు
ఆది నుండి నిన్ను సంరక్షించిన వెన్నుదన్ను
కలపకాదు తెగనరకటానికి
ఆమె ధరణికాదు
హలంతో బలంగా దున్నడానికి
లోకం కన్నీరు ధారలైనా
కరగని శిలలు మీరు
అబం-శుభం ఎరుగని
చిన్నారుల పైనా మీ అఘాయిత్యం..?
తన శరీరమే ఆహారమని
ఆరగిస్తున్న రాబందులు మీరు
ఇక అమావాస్యను దాటలేరా..!
ఆ కాంతిని మీరు చూడలేరా..?
తన శరీరానికి ఓ ప్రాణం వుంది
దానికంటు ఓ.. ఆశయం వుంది
మొగ్గల్లోనే తుంచి వేయకండి
పువ్వుల్లా వికసించనీయండి
నీ కంటూ ఓ తల్లీ-చెల్లీ
మీరు చేసేది నిజమే అయితే..!
మీవారితో జరుగబోదా ఈ లొల్లి
నిన్న-మొన్న మన గల్లీలో
నేడు సాక్షాత్తు కాషాయ యూపీలో
ఏమిటీ ఈ చాదస్తం మూర్ఖత్వం..!?
ఆపరా..!
ఇకనైనా మీ దేశద్రోహ క్రూరత్వం
అసలు మీరు మృగాలా
లేకా..!!
వావివరుసలు లేని మొగళ్ళా..!?
మీరు జలగలా..!
దళిత స్త్రీల రక్తం గ్రుచ్చి పీల్చడానికి..?
బాకులా..!
వారి హృదయాలను గాయపర్చడానికి..?
మార్పు రావలసిందీ
కామాంధుల తన్విలో కానీ..!
స్త్రీల తనువులో కాదూ..