Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేబియ్యం .శ్రీనివాసరావు
శ్రీకాకుళం, 7674055482
అకృత్యపు నీడలు వదలని మృగాలు
మనుష రూపాన్ని సంతరించుకొని తిరుగుతున్న కౄర జంతువులు
వికృత చేష్టల వెకిలి వికృత రూపం లోపల భద్రం
సాత్విక పలకరింపుల బాహ్య మంచితనం
వద్దు అలాంటి మృగాలను అంతరంగా బ్రతనీయొద్దని శపధం చేద్దాం
మనతో తల్లిగర్భం నుంచి వచ్చు మూర్తిమత్వం దైవత్వం అని భావిద్దాం
పిల్లలకు చిన్ననాటినుండి చెడును నేర్పడం మానేద్దాం
మనం ,వారు అన్న భేదం కాక మనం అంతా అని మొప్పుదాం
చెడు తలంపు రానీయని " చెడును చెరుపు " మాటలు చెపుదాం
సమసమానత్వం బడి వయస్సునుండి ప్రారంభిద్దాం
ఇందులో నీది ,నీది ,నాది కూడా భాద్యతుందని గుర్తిద్దాం
వ్యవస్థను విమర్శించక ,ఈ అవస్థని రూపుమాపుదాం
పరస్పర గౌరవ విలువలను పిల్లల నాటినుండి అలవరుద్దాం
అఘాయిత్యపు ఆనవాళ్లను చెరిపేద్దాం
అకృత్యపు ఆలోచనల మొలకలను తురిమేద్దాం
అన్యాయపు కట్టుబాట్లను తెంపేద్దాం