Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘాలి లలితా ప్రవల్లిక
బూత్పూర్, మహబూబ్ నగర్
9603274351
గల్లు గల్లు న కాలిగజ్జలుమోగంగ
బతుకమ్మనాడారు సుదతులంతా
గునుగుతంగేడీలుగుమ్మాడీ పూలతో
బతుకమ్మపేర్చిరిఉత్సాహంగా
పపగల్లుపప
ఆనాటి పాలకులు ఆడపిల్లను చూస్తే
వదలకచెరపట్టి చంపుతుండే
పూలల్లాంటిఇంతిగొల్లుగొల్లుమని
దుర్గమ్మనేవేడె బ్రతుకియ్యామని
పపగల్లుపప
కాలాలే మారిన రాజ్యాలె కూలీనా
కాముకుల కళ్ళల్లో మార్పు లేదు
పసిమొగ్గై నావసివాడినపూవైనా
కాల రాచేస్తున్నారు అయ్యో అయ్యో
పపగల్లుపప
తీరొక్క పూలతో తీర్చిదిద్దితల్లి
చేయి చేయి కలిపి కొలిచేదమూ
ఆడి పాడి నిన్ను వేడుకుంటున్నాము
బతికించి మాకు బతికియ్యమని
పపగల్లుపప