Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురేంద్ర నాథ్
8074219685.
మగాళ్ళు క్రూరమృగాలై...
అతివలను అనుభవించి
అంతమొందిస్తున్న వైనం!!
చట్టాలు ఎన్ని వచ్చినా ..
అభాగ్య స్త్రీల బ్రతుకులు...
క్రూరమృగాల చేతుల్లో .బలి అవుతూనే ఉన్నాయి!!
అంతర్జాల నీలిచిత్రాల ప్రభావమో ?నీతిమాలిన పెంపకాలో... ఏమో?
భర్తల మూర్ఖత్వానికి బలై..
బ్రతుకు విరక్తై ...
బలవన్మరణానికి పాల్ప డే వారు ఇంకొందరు!
రెండు వేల పద్దెనిమిది సంవత్సరపు జాతీయ నేరాల లెఖ్ఖల ప్రకారం...
ప్రతి పదిహేను నిమిషాలకు జరుగుతోంది ఒక అత్యాచారం!!
నిర్భయ . అభయ.. దిశ ..మనీషా.. ఇలాంటి వారింక ఎందరో కదా!!
హద్దూ ఆదుపు లేని కొంతమంది మగాళ్ళ ఉన్మాదం..
కనిపెంచిన తల్లిదండ్రులకు
కాకూడదు శాపం!!
ఇక పరువు హత్యల పేరుతో....
కన్న బిడ్డల ను కనికరం లేకుండా...
అంతమొందిస్తున్న వైనం....
హృదయాన్ని కలచి వేస్తోంది !!
లవ్ జిహాద్ లు ఒక ప్రక్క ...
పరువు హత్యలు ఒకప్రక్క...
ఉన్మాద హత్యలు ఒకప్రక్క....
ఆత్మహత్యలు ఒకప్రక్క.....
స్త్రీ జాతిని చుట్టుముడుతున్న పిశాచాలు ఇవి!!
తలుచుకుంటేనే ...
నారక్తం ...ఉడికి పోతోంది!!
వాటి ఆటకట్టించాల్సిన సమయం ఆసన్నమైంది!!
ఈ నేరప్రవృత్తి ..ఈ విషాద సంస్కృతి..
ఎక్కడికి దారి తీస్తుందో ?
ఈ నా దేశం ఏమైపోతుందో.. ?