Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిద్దె మురళీ కృష్ణ,
అనంతపురం .
9985590196
అఖండ భారతమంతా కండకావరమే,
ఆసేతు హిమాచలం వికృత విన్యాసమే ,
పసివారి నుండి పండు ముసలి పై కూడా,
తాతలు ,తండ్రులు, గురువులు కళాకారులు,
కాడెవ్వరు వక్రబుద్ధికి అనర్హం,
వీరిలోని మృగాడు ఒక్కడే,
జనారణ్యంలో జంతువులు,
సహజీవనం చేస్తున్నాయి,
నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ,
నిర్భీతిగా కదం తొక్కుతున్నాయి ,
చట్టాల లొసుగుల్ని ముసుగులుగా చేసుకుని,
దుష్ట సమూహాలు పెట్రేగి పోతున్నాయి,
పాతచింతకాయ చట్టాలను తిరగ రాయండి,
పదునైన శిక్షాస్మృతిని స్వాగతించండి,
అత్యాచారం చేసిన వాడి వయసుతో పని ఏముంది,
బాలుడైన, బాబా అయినా దుష్టశిక్షణ జరగాల్సిందే,
అతి పెద్ద ప్రజాస్వామ్యం అని బడాయి చాలించండి,
అత్యాచార నేరస్తులకు ఉరి శిక్ష విధించండి,
గవర్నర్ల దగ్గర నుండి గుడ్డి గవ్వకు సరితూగని,
ప్రతి మగాడి మదం అణచాల్సిందే,
మనిషికో మాట పశువుకో దెబ్బ,
మానవ పసరాల శాతం, వాతం పెరుగుతోంది,
తస్మాత్ జాగ్రత్త.