Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దెల సరోజన
జగిత్యాల
దుశ్శాసనుల దుర్మార్గం ఆపి
పౌరుషాన్ని నిలిపే.....
కళ్ళముందు జరుగుతున్న
దౌర్జన్యం ఆపండి
పరువుతీసి ప్రాణాలు ...
తీస్తున్నపశువులను
తన్నండి తరిమి కొట్టండి!!
కన్నెలెందరినో కాటిపాలుజేస్తూ
పసిపిల్లల గొంతు నుమిలి
కామపు పొరలు కప్పుకుని
కండకావరమెక్కిన కామందులను
తన్నండి తరిమి కొట్టండి!!
పట్టపగలు నడిరోడ్డులో
చెరపట్టే కీచకులను
మాయ మాటలు చెప్పి
మోసగించు వంచకులను
కాలరాసి కాటికి పంపించండి
తన్నండి తరిమి కొట్టండి!!
ప్రేమ పేరుతో కాటువేయు
విష నాగులను....
పర స్త్రీని మధంతో
చూసే మగ పురుగులను
ధైర్యంతో ఎదిరిస్తే.....
దైవం తోడుండు
ధైర్యమే నీ ధనం దైవం
మద్దెల సరోజన
జగిత్యాల
9908352377