Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దార్‌కు కవిత
కౌలాస్ గ్రామం, కామారెడ్డి జిల్లా
ఆడవారిని దైవంగా కొలిచే దేశం మనది
అలాంటి దేశంలో పుట్టి అమ్మలపైన అత్యాచారం ఏంటి
సృష్టి పుట్టుకకు కారణం స్త్రీ
స్త్రీ లేకుంటే మనిషికి మనుగడేది
ఇంటా బయటా యేలే మహారాణులు
అత్యాచారానికి బలి అయితే ఎలా
ఎదురించి నిలబడు ముందు
ఆదిశక్తి అవతారానివి
కామాంధుల చేతుల్లో అలా ఎలా నలిగిపోతావ్
శక్తికి అస్త్రం అవసరమా?
చేతి గాజులు,జడపిన్నులు ఉండగా
స్త్రీ ధరించే ప్రతీ వస్తువు ఆయుధమేగా
అది మరిచి కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నావెందుకు
కాళికవై కామాంధుల కళ్ళు పీకి కాకులకు గద్దలకు వేసే సత్తా నారీమణులకుంది
పురుష అహంకారంపై పిడిగుద్దులు గుద్ది
ఆదిశక్తి అవతారమై నరమేధం గావించు
స్త్రీ అంటే శక్తి అని లోకానికి చాటి చెప్పు
ఎవరివల్లా నీకు న్యాయం జరగదు
ఎదిరించి పోరాడినపుడే నీకు నువ్వు న్యాయం చేసుకున్నట్లు
ప్రతీ మనిషి ఆడదనే అమ్మ కడుపు నుంచే పుట్టారని మరవద్దు
ప్రతీ తల్లి దండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుండి ఆడవారి పట్ల గౌరవంగా ఉండమని నేర్పితే
ఇలాంటి అఘాయిత్యాలు ఎలా జరుగుతాయి
అవగాహన లేని వయస్సు లో మత్తుమందు కు బానిసై ఏం చేస్తున్నారో తెలియని స్థితి లో
తెరిచి చూసేలోగా ఎన్ని జీవితాలు బలైపోతున్నాయి
కారణం తల్లిదండ్రులా! పిల్లలా! ఎవరు!