Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పరాంకుశం రఘు నారాయణ
మహబూబాబాద్, 9949749987
లైంగిక దాడులకు వ్యతిరేకంగా
మహిళలకు అత్యంత గౌరవ స్థానమిచ్చే
భారతావని లాంటి పవిత్రదేశంలో
దుర్మార్గుల చేష్టలు నిత్యకృత్యమయ్యాయి!
అనాదిగా స్త్రీని మాతృదేవతగా కొలిచే
తత్వాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు!
కుహనావాదులు, మానవత్వాన్నిమంట కలుపుతున్నారు !
ఈ దాష్టీకానికి కఠిన శిక్షలెన్ని అమలు పరిచినా !
కఠినాతి కఠిన చర్యలెన్ని తీసుకున్నా !
దున్నపోతు మీద వానపడ్డ వైనంగా...,
తడుముకోకుండా, తడబాటు లేకుండా..
మళ్లీ దుశ్చర్యలకు ఉపక్రమించడం విషసంస్కృతి కాదా !?
సాటి మనుషులన్న మానవీయ కోణాన్ని మర్చిపోయి..
దుర్నీతికి పట్టం కట్టే దుర్మార్గులకు భీకరరీతిలో..
శిక్షలు అమలు చేయాలి? చట్టాల మార్పులను స్వాగతించాలి!
బాధితులకు న్యాయం జరిగేలా!
సభ్యసమాజం వారికి అండగా ఉండాలి!
భారతకీర్తిని అపప్రదం చేసే ఈ కిరాతకులపై..
మన వీరావేశపు భావ ప్రభంజనాన్ని
ఝళిపించే దిశగా అడుగులు వేద్దాం!
నయవంచకుల భరతం పడతాం!
ఆడపిల్లను *బతుకు అమ్మా!* అని దీవిద్దాం !!