Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పి .విజయ లక్ష్మీ భవాని
8121493067
నోటితో నవ్వుతూ
నొసటితో వెక్కిరించిన చందాన
మహిళలను కొనియాడుతూనే
చూపుతున్నారు వివక్ష
సమాజంలో స్త్రీకి లేదు రక్ష
ఇంటా బైట హింస
ఎదురు తిరగలేని బలహీనత
మృగాళ్ల లైoగిక దాడులు
ప్రేమించనంటే యాసిడ్ దాడులు
వీటికి వ్యతిరేకంగా గళం విప్పాలి యువత
పెరగాలి అక్షరాస్యత
రావాలి చైతన్యం స్త్రీ లో
మానవ విలువలు నేర్పాలి
పిల్లలకు బాల్యం నుండే
అప్పుడే స్త్రీకి మనుగడ
హి oస కి మత్తు ఓ కారణం
అమలు చేయాలి మద్య నిషేధం
నిర్భయ, దిశ చట్టాలు వున్నా
అమలుకు సున్నా
అవి అమలు చేసినప్పుడే
స్త్రీ కి రక్షణ
మారాలి అధికార యంత్రాంగం పని తీరు
ఎన్ని చేసినా గాని
రావాలి మనిషిలో మార్పు
మహిళ కూడా ఆత్మ విశ్వాసంతో
పురుష శక్తికి తాము ఏమీ
తీసిపోమని చాటి చెప్పాలి.