Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వేదాంతం విశ్వప్రసాద్
చెన్నూర్, 9912417417
నవ మాసాలుమోసి నీకు జన్మనిస్తుంది
ఇల్లాలి గానీ ఇంటి దీపమై వెలుగు నిస్తుంది
తోబుట్టువు గా నీ పై మమకారం చూపిస్తుంది
కన్న కూతురి గా ఆప్యాయత పంచుతుంది
మగువ లేకుండా మనకు మనుగడ లేదు
మానవ సృష్టికి వారు కారకులు అన్నది మరువరాదు
ఈ జీవన సత్యాన్ని నేడు మర్చిపోతున్నాం
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాం
మానవులుగా పుట్టి మృగాలుగా మారుతున్నాం
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడుతున్నాం
మాతృదేవోభవ అన్న మాట మర్చిపోతున్నాం
వావివరుసలు మరచి వింత పోకడలు పోతున్నాం
మానవ రూపంలో దానవులై తిరుగుతున్నాం
మానవత్వాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం
నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నాం
ఇప్పటికైనా కళ్లు తెరిచి మారడానికి ప్రయత్నిద్దాం
ప్రతి స్త్రీ మూర్తి లో ఒక మాతృమూర్తిని దర్శిద్దాం
మానవతా విలువలకు నిదర్శనంగా నిలుద్దాం
మగువల పై అకృత్యాలను నిరోదిద్ధాం
స్త్రీహింసకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ గౌరమ్మను పూజిద్దాం
గౌరీ దేవి ప్రతిరూపాలుగా స్త్రీలను గౌరవిద్దాం.