Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాశబోయిన నరసింహ(నాన)
చిట్యాల,నల్గొండ - 9542236764
శరన్నవరాత్రుల సుమ శోభిత మహోత్సవం
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయ సమ్మేళనం
చప్పట్ల వాయిద్యాలతో తరుణుల సంబరం
పుడమికి పుత్తడి పూలాభిషేక వైభవం
పొద్దస్తమానం పనులతో అలసి సొలసిన
జాలువారే జనపద బతుకుజీవుల ఆటలతో
ఐక్యత ఆత్మీయత అనురాగాలు రంగరిస్తూ
ఏడాదికోసారి ఎదురుచూసే పూల పండుగకై
నూటొక్కపూలు కోటొక్కకోరికలతో సుదతులు
నవాబు భూస్వామిపెత్తందారీ అకృత్యాలనల్గి
ఆత్మహత్యలకాహుతైన తల్లుల తలుచుకొని
అందాల బతుకమ్మ అద్భుతావిష్కరణదృశ్యం
పెత్రమాసదినం ఎంగిలిపూలతో ఆరంభం
దుర్గాష్టమి సద్దులతో బొడ్డెమ్మ నిమజ్జనం
తెలంగాణ పోరున ఆట పాటలస్తిత్వమై
ఊరునేకం చేసిన ఉద్యమ గొంతుకవు!
ఆడబిడ్డ పుట్టడమే పాపమా! నేరమా?
మన్ను మిన్నూ మరిచి కామం నిండిన కళ్ళతో
నేటి మృగమగాళ్ల జగత్తున అనుక్షణం భయం
జడలో పూలు మెడలోవేసి ఉరేసి ఊరేగిస్తాడు
నైతికవిలువకు శిలువేసి మానవత్వం మర్చి
రేపటి అమ్మల ఆత్మహత్యల విత్తనమౌతాడు
పేగుబంధం పెనవేసుకున్న బతుకమ్మా!
బతుకునిచ్చే అమ్మా! మహా శక్తిివై పోరాడమ్మా