Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎ.సంతోష్ కుమార్ రెడ్డి
సిద్దిపేట, 9441680024
ప్రేమానురాగాల రూపం
ఆత్మీయ అనుబంధాల ప్రతిరూపం
పుట్టినింటా మెట్టినింటా ఆదర్శం
ప్రకృతి అంతటి గొప్పతనం
పుడమి అంతటి సహనం
అదృష్టదేవతైన అమ్మానాన్నల అనురాగం
మహలక్ష్మిలా అందరి బంధువుల మమతానురాగం
కానీ
కొందరి మృగాళ్ళ పైశాచికత్వం
రాబందుల కర్కశత్వం
పాశ్చాత్యపోకడలంటూ గాలం
మితిమీరిన మాటలు చేతలు
వద్దని వారించిన వారినే హతమార్చేందుకు వెరవని నైజం
ఇదెక్కడి సంస్కృతి,ఎక్కడ నేర్చిన విష నాగరికత
భద్రత లేని ఆధునిక సమాజం...
ప్రపంచానికే సంస్కృతి,సంప్రదాయాలు నేర్పిన మన దేశం
మేధావుల,మహనీయుల పుణ్య వచనాల శాంతిధామం
తల్లిగా,చెల్లిగా, ప్రేమరానురాగాలకు ప్రతీకగా
కుటుంబ అభివృద్ధిని కాంక్షించే స్త్రీ మూర్తిగా
మానవత్వం,మంచితనం కలబోసిన సౌజన్యమూర్తులపైన
దాడులు,దౌర్జన్యాలు,
వేధింపులు,వెకిలిచేష్టలు
ఇకనైనా ఆపండి
మనుషులుగా మెదలండి
సమాజాన్ని కాపాడండి