Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మహేష్ దుర్గే - 8333987858
కాగజ్ నగర్, కెబి ఆసిఫాబాద్ జిల్లా
అవనిలో సగం
ఆకాశం లో సగం అంటారు
సగభాగం మా హక్కు
మేములేకుండా మగాడికెవరు దిక్కు
అని తెలిసినా లొంగి వంగి ఉంటారు
మగాడు మృగమైతే
మీరు మనిషై బంధించలేరా
మహిళంటే అబల కాదు
సర్వవిధ సబల అని నిరూపించలేరా
రండి నేనుంటాను మీతోడ
ఒకరికొకరం కలిసికట్టుగుంటే
ఎల్లవేలల తోడవు నీడ
అపుడే తొలిగిపోవు
అజ్ఞానాంధకారపు జాడ
లేవండి
తెగించండి
త్యాగం చేయండి
మీకు మీరే ముందైతే
రాబోవుతరం మీదవుతుంది
స్త్రీ పురుష వివక్ష సమసిపోవు
సమసమాజం మనదవుతుంది
విచక్షణా
వివేచనా
ఆలోచనా...
కలగలిపి సమాలోచన చేద్దాం
విచరణమెందుకు
విచారమెందుకు
తరతరాలుగా నరనరాన
జీర్ణించిన పురుషాధిక్య భావాలు
ఇంకెన్నాళ్లు, ఇంకెన్నేళ్ళు ఈ బానిసత్వపు జీవితాలు
లింగం, వర్ణం, జాతి, కులం, ధర్మం
ప్రాంతం, భాష, యాస, పేద, ధనిక
ఎనున్నా వివక్ష లన్నింటికీ సమాధి కడదాం
నువ్వు నేను
మీరు మేము
వారు వీరు...
మనమందరమేకమవుదాం
రాబోవు తరాలకు
సమసమాజం నిర్మిద్దాం...