Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బషీర్
హైదరాబాద్ ,9396601262
ఆడ బతుకమ్మ జన్మ
జాడ కనుమరుగవుతున్నది !
ఈసడింపుల సెగలో తల్లి గర్భంలోనే బ్రూనహత్యౌతుంది !
కామాంధుల విషకౌగిలిలో
పసిబతుకమ్మ ఆహుతౌతుంది !
మదమెక్కిన మత పిచ్చిలో
మంటల్లో మసి అవుతున్నది !
కులచిచ్చులోచిక్కి, శిథిలమవుతుంది !
పరువు -ప్రతిష్ట ఊబిలో
పతన మవుతున్నది !
డబ్బు వలలోపడి అత్తారింటి వేధింపుల గ్యాస్
మంటలకీ ఆవిరవుతుంది !
ఆడ జన్మ ఈ జగత్తులో
లేకుంటే ?పూర్వ జన్మ లేదు
రేపటి తరంలేదు,!
చెదలు పట్టిన చట్టాలని తరిమేద్దాం !
ఆత్మ రక్షణ, మనోబలం ఆయుధమై, ఆపదలో ప్రతి వస్తువుని అందుకొని
అస్త్రంగా చేసుకుని
కామాంధులను తుదముట్టిదాం !
వీరనారులమై విజృంబించి
నవ నారి శకానికి నాంది పులుకుదాం !