Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి గంగాధర్,
హన్మకొండ, వరంగల్ అర్బన్
9440146435
తరాలెన్ని మారినా...
అతివల రాత మారకపోయే
ఈ నవ నాగరిక సమాజం లో
నేడు స్త్రీలు జీవించడమే ఒక సమరం
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
ఎంతో అద్భుతమైన ఉవాచ
నేటి సమాజంలో ఇది జరిగే పనేనా ఆశ్చర్యమే...
ఒక ఆంత్రాస్,ఒక హైదరాబాద్,ఒక ఢిల్లీ
దేశమంతా క్రూర మృగాల సంచారమేన
అమాయక పసివాడని బాలికలు బలికావలసిందేన
ఈ కుటిల రాజకీయ నేతల రంగుల గారడీలు ఎంతకాలం
దోషులను రక్షించే ఈ దాగుడుమూతల యత్నాలు ఎంతకాలం
ధన,రాజ్య బలంలో అతివల మానానికి విలువలేదా..!
విలువలు విచ్చలవిడిగా డబ్బుకు అమ్మేసుకుంటే..
ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడుంది
మదంతో రంకెలేసే ఉన్మాదులకు ఇక అడ్డెక్కడిది
సమాజంలో కరడు కట్టిన క్రౌర్య కిరాతకులు విచ్చలవిడిగా
చేస్తున్న దౌర్జన్యాలకు అంతం ఎక్కడ...
మహిళా మేలుకో....
ఈ అన్యాయాన్ని ప్రశ్నించు
ఈ అకృత్యాలపై తిరుగబడు
ఓ సమాజ మానవులారా లేవండి
మన ఆడబిడ్డలపై జరుగుతున్న అమానవీయ దుశ్చర్యలను అడ్డుకుందాం
అవి చేసేవారు వారు ఎవరో కాదు మనవాళ్లే
వారి మనసులను మారుద్దాం
ఆ క్రూర మృగాలకు కఠిన శిక్షలు పడేలా చేద్దాం...
ఇక ఆడబిడ్డ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూద్దాం
వారి జీవితాల్లో వెలుగులు నింపుదాం
ప్రభుత్వ పెద్దలారా మీరు మారండి
చట్టాలను బలోపేతం చేయండి
నేరస్తులను తప్పించడం మానుకోండి
వారికి కఠిన శిక్షలు పడేలా చేయండి
మనది పవిత్ర భారతదేశం
స్త్రీలను దేవతలా పూజించే దేశం
ఇకనైనా అపుదాం ఈ అసాంఘిక అమానవీయ చర్యలను