Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేనెప్పుడు...
ఏమి చేయాలన్న..
ఏదో..తెలియని బంధుత్వం
అడ్డు పడుతోంది..!!
మనసును పట్టేస్తోంది..!!
గుండెను కట్టేస్తోంది..!!
నన్ను చుట్టేస్తోంది..!!
కలంపట్టంది..
నాకు ఆకలిపుట్టదు..
కవిత్వం రాయంది..
కడుపు నిండదు..!!
చూపులకు
అందనివకుండా..
చేతలకు..
చిక్కనివకుండా.. చేస్తోన్నారు..!!
ఇదేమి..
అనుబంధంమో..? తెలియదు..
నా దారిని ఎక్కడికో ..
మళ్లించడానికి ..
చూస్తోన్నారు..!!
కళ్ళకు కనిపించే అద్భుత..
ప్రతిభ వస్తువును
నెట్టేస్తోన్నారు..!!
అందమైన భావకుని కాదు..
అంతరాత్మలోంచి రావడానికి..
చూసిన చూపులోంచి..
బాధల గుండె శబ్దంలోంచి..
సమాజం సమస్యలోంచి..
పడిలేస్తోన్న..
ప్రజల నిట్టూర్పులోంచి..
ఏదొ రాసి కడుపు నింపుకొంటా..!!
ఏ కవియైన.. నిత్యం పుట్టెడు బాధలను
తన గుండెపోరలో నింపుకొని..
చూపునిండ..తెలియంది ఏదో మొస్తోంటాడు..!!
ఈ బరువు దిగాలంటే కవి రాస్తోండాలి..!!
అయినా నాఊహాల్ని ..
నాయెత్తుల్ని..
ఎవరు పట్టుకోలేరు..
లోతైన ఆలోచనలకు..
అడ్డుపడలేరు..!!
నేను నిర్మించుకున్న..!!
ఓ అద్భుత ప్రపంచంలోనే
జీవిస్తున్న ఓ సరికొత్త
వ్యక్తీకరణను ఏర్పడ్చుకున్న..!!
బంధుత్వం బాధలను పంచుకోరు..
బరువును దించుకోరు..
కొందరు ఆత్మీయతను చూపుతూ..
ఆత్మను పిండేస్తారు..!!
అంతరాత్మను నులిమేస్తోరు..!!
తెలియంది ఏదో లేవనెత్తుతారు..!!
తెలిసేలోపు పరుగులు తీస్తోరు..!!
కాలాన్ని అనుసరించి
అవసరాన్ని నింపుకొని
పరుగుపరుగున వస్తోరు..!!
అందరిని పరిశాను చేస్తోరు..!!
అనాది నుండి వీడని బంధాలు
నడుస్తోన్నా వాస్తవాలు..!!
- అంబటి నారాయణ
నిర్మల్
9849326801