Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం...
ఈ భూమి మీద
ఓ శిలా శాసనం ..
దానికింద
ప్రకృతి సంతకం..
కాలాన్ని కదిలించలేరు
కాలంతో పరుగెత్తలేరు
అన్నీ తానై చూస్తోంది..!!
లోకాని కని పెట్టుతోంది..!
విశ్వానికి
ఓ విషయ సూచిక..
విషయాన్ని
అందించే ఓ దిక్సూచిక..!!
ఎన్ని మైలు రాలు దాటిన..
మనవెంటే ఉంటోంది
ఓ కంట కనిపెడుతోంది
ఓ మహత్తర శిల్పంగా..
నిలబడుతుంది..!!
సూర్యచంద్రులు దివిటిలై..
అవసరాని బట్టి..
కాగడలుగా మారుతాయి..
క్రాంతి వేగంతో పరుగెత్తుతాయి..!!
శాంతి కౌముదిగా మారుతాయి..!!
కాలం ఆదినంలోనే నడుస్తాయి..!!
కాలం ఓ కరవాలమే..
ఏ అద్దులు లేని..
ఏ సరి హద్దులు లేని..
శతాబ్దాల శిలాశాసనం..!!
ఓ లోకాన్ని పుట్టించింది..!!
ఈ లోకంలో జనాలను సృష్టించింది..!!
ఈ భూమినుంచి వెళ్లేంతవరకు..
కాలం వలగా..
ప్రకృతి దడిగా..
ఆవరించి ఉంటాయి..!!
యుగయుగాలుగా..
ఈ నేలను చూట్టేసుకొని..
తన ప్రతిభ పాఠవాలితో..
ప్రాణ కోటికి..
ప్రావీణ్యతను అందిస్తోంది..!!
మార్పులను తెప్పిస్తోంది..!!
జీవుల యొక్క బతుకులు..
చావుపుట్టుకల రాతలు..
తన అస్తిత్వంతో వ్యక్తిత్వాలను..
అంతరంగ మార్పులు..
ఆనంత విషయాలు..
అన్నీకూడ కాలంలోని మార్పులే..!!
ప్రతి ఒక్కరికి కాలం అవసరం..
కాలంలోని మార్పులవసరం..
మనమందరం కాలం..
వినియోగ దారులమే..!!
కాలం ఎప్పుడు ఓ సజీవ శిల్పం..!!
ఈనేల మీద ఓ జీవిత లతలా..
అల్లుకుపోతుంది..!!
మనం తన గుండె ..
గూటిలోని ఎగిరే పక్షులం..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801