Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరిలా తానూ సినినటి నౌమనే
సినీరంగంలో ప్రవేశించి
చిన్నా చితక వేషాలు వేసి
కడకు తెలుగువారి ప్రియమైన
గయ్యాళి అత్తగా నటించి
నట విశ్వరూపాన్ని చూపించి
సహజనటిగా ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్నది!
నాణేనికి బొమ్మ బోరుసులున్నట్లు
నిజ జీవితంలో అత్తయ్యకు
గయ్యాళితనం, మంచితనం రెండూ ఉంటాయి
మంచికన్నా చెడుకు గుర్తింపు ఎక్కువ
ఆ మక్కువే సూర్యకాంతాన్ని
గయ్యాళి అత్తను చేసింది
తెలిగింటి అత్తగారంటే సూర్యకాంతం అనేలా
నవరసాలను ఒలికిస్తూ
పాత్రలో పరకాయ ప్రవేశం చెంది
తన నటనాభివేశాన్ని ప్రదర్శించి
గయ్యాళి అత్తల పాత్రకు జివ్స్మ్ పోసింది!
ఆ నాటి నుండి నేటి వరకు
సంఘంలో వెళ్లునుకున్న గయ్యాళితనపు అత్తల
పాత్రల చిత్రీకరణకు ఊపిరి పోసింది!
నటనలోనే గయ్యాళితనం
నిజజీవితంలో మృధుమధు ర స్వరం
మెతకదనపు స్వభావం ఆమెది!
నేటి నటిమణుల్లా ఆస్తులు సంపాదించకున్నను
ఆంధ్రుల అడరాభిమానా లను,
అప్యాయతా నురాగాలను
అందుకున్న
సాటి లేని మేటి సహజనటి
సూర్యకాంతం
జయంతి సందర్భంగా ఆమెను
స్మరించుకుందాం!
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు...జిల్లా
7426638823