Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ సహనమే
మహాత్ముడిని చేసింది..
ఆంగ్లేయుల జాత్యాహంకారాన్ని
అణచి వేసింది..
బందిఖానాలో బాధలకి గురిచేసినా.
తుపాకులతో తూట్లు పొడిచినా..
పట్టు సడలని పట్టుదతో
చెదరని గుండె ధైర్యం..
చెరగని చిరునవ్వు ..భరతమాతను దాస్య శృంఖాల నుండి విముక్తి పరించి..మనల్ని స్వతంత్ర్యులను చేసింది..
గాంధేయవాదం సర్వమత సమానత్వంతో
సమైక్యతను ఎలుగెత్తి చాటింది..
సమతా మమతలను ప్రభోదించింది..
సేవాతత్పరతను తెలియజేసింది..
నవ భారత నిర్మాణానికి నాంది పలికింది..
సత్యమేవజయతికి నిదర్శనముగా నిలిచి..
శాంతి మార్గంలో సమర శంఖాన్ని పూరించి..
నిస్పక్షమాతంగా నిస్వార్ధంగా దేశ సేవందించిన ఆదర్శ నేత..మన జాతిపిత..!!
- సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
7780153709