Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతాల సారం మానవత్వం
కులాలసారం కరుణత్వమై
ఒకే చెట్టుకు పూసిన పువ్వులమై
భరతమా త కంఠంలో విభిన్న పూలతో
ఒకే దారానికి గుచ్చిన పూలదండలమై
భిన్నత్వంలో ఏకత్వమై
ఏక తాటిపై నడుస్తూ
సమైక్యత కు చిహ్నమై
సమగ్రతకు నిదర్శనమై విలసిల్లేలా చేసింది
ఉక్కు మనిషి పటేల్ ఉద్యమ స్ఫూర్తి !
సర్దార్ బిరుదును గడించి
ఉక్కు మనిషిగా దేశభక్తిని చాటుతూ
దేశ స్వేచ్ఛకై అలుపెరగక పోరాడిన
స్వాతంత్ర్య సమరయోధుడు వల్లభాయ్ పటేల్ !
అహింసా వాదానికి ఆకర్షితుడై
బాపూజీ కి చేదోడు వాదోడుడవై
వివిధ సత్యాగ్రహాల్లో భాగస్వామివై
భారత స్వాతంత్ర్య సమరానికి
దిక్చుచి వై నిలిచిన
ఉక్కు మనిషి ఉద్యమ స్ఫూర్తికి జేజేలు పలుకుదాం
స్వేచ్చా ప్రదాతకు
ప్ర ణ మిల్లుదాం !
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు
సెల్ నెంబర్. 7416638823
allanageswararao1965@gmail.Com