Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానమామలై వరదాచార్యులు ఆగష్టు 16, 1912 న జన్మించాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా, కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912 'శ్రావణ బహుళ ఏకాదశి' నాడు జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివాడు. అయినప్పటికీ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు. తన 18వ యేట మేనమామ కొదుమగోళ్ల జగన్నాథాచార్య ఏకైక కూతురు వైదేహితో వివాహం జరిగింది. ఈయన అన్నలైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు కూడా సాహిత్యకారులే.
ఇతని సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించాడు. ఆ తర్వాత ఇతడు ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నాడు. విశారద పూర్తయ్యాక చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పాడు. 1972లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ఇతడిని శాసనమండలికి నామినేట్ చేశాడు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగాడు.ఇతడు తన 13వయేటనే పద్యరచన ప్రారంభించాడు. 64పైగా రచనలు చేశాడు.
- మణిమాల (పద్యగేయకృతి)-1945
- ఆహ్వానము -1958
- శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం
- పోతన చరిత్రము (మహాకావ్యము)-1966
- జయధ్వజం
- విప్రలబ్ధ (గేయ కథా కావ్యం)
- స్తోత్ర రత్నావళి (అనువాద కావ్యం)
- భోగినీ లాస్యం (వ్యాఖ్యానం)
- గీత రామాయణం (అనువాద గేయ కావ్యం)
- వైశాలిని (మహా నాటకం) -1975
- సూక్తి వైజయంతి (సుభాషితాలు)
- శ్రీ స్తవరాజ పంచశతి (శతక సంపుటి)
- అభ్యుదయ నాటికా సంపుటి
- రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి)
- దాగురింతలు (పద్య కావ్యం)
- వ్యాసవాణి (వ్యాసాలు)
- కూలిపోయే కొమ్మ (వచన కథాకావ్యం)
- మానవులంతా మనవాళ్ళే(నవల)
పాటలు
అలంకార శాస్త్రం
శాకీర్ గీతాలు (అనువాదం)
పోతన (బాలసాహిత్యం)
శ్రీ హనుమాన్ చాలీసా (అనువాదం)
రాజ్యశ్రీ
సత్యమేవజయతే
నాగార్జున సాగరము
జానపద భారతము
గ్రామ సుధార్
స్వతంత్ర భారతము
ఆజాద్ గోవా
సంక్రాంతి
పగటి దొంగలు
స్నేహశక్తి
వయోజన విద్య
పెద్దల చదువు
స్వాతంత్ర్యజ్యోతి
మోహినీభస్మాసుర
మహిషాసుర మర్దని
బుద్ధచరిత్రము(బుర్రకథ)
ప్రజాసేవ(బుర్రకథ)
ఎవడు రాజు (బుర్రకథ)
మనదే జయము
చైనా యుద్ధము
భీమమానసరక్తి
తులసీరామాయణము
మాతృప్రేమ
శ్రీ మార్కాండేయ సుప్రభాతము
అలంకార శాస్త్రము
గీతోపన్యాసములు
ఏకపాత్రాభినయములు
ప్రహసనములు
గేయరామాయణము
భజ యతిరాజ స్తోత్రము
నరహరి నరసింహారెడ్డి జీవితచరిత్రము
గౌరీశున్యాసములు
దేశభక్తి
గొల్లసుద్ధులు
మణిమాల గ్రంథాన్ని ఆంధ్రసారస్వతపరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు. వరదాచార్యులు ఈ పరీక్షకు తాను వ్రాసిన గ్రంథాన్నే పాఠంగా చదువుకున్నాడు.విప్రలబ్ధ కావ్యం నుండి వర్షాలు అనే పద్యభాగాన్ని నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.ఆరవ తరగతి తెలుగువాచకంలో ఇతడు వ్రాసిన కుసుమోపదేశము అనే పాఠం చేర్చబడింది.
పోతన చరిత్రములోని ఒక ఘట్టం భోగినీ లాస్యమును యువభారతి కోసం వ్యాఖ్యాన సహితంగా అందించాడు.
పురస్కారాలు;
- 1968లో పోతనచరిత్రము గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు.
- 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ విశిష్ట సభ్యత్వము.
- 1973లో కరీంనగర్ జిల్లా కోరుట్లలో భారతీ సాహిత్య సమితి వారిచే గండపెండేరం,స్వర్ణ
కంకణం,రాత్నాభిషేకం
- 1976లో సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం, వారణాసి వారిచే డి.లిట్ వాచస్పతి గౌరవ పట్టా
బిరుదులు;
- అభినవ కాళిదాసు
- మహాకవి శిరోమణి
- ఆంధ్ర కవిత ఉత్ప్రేక్ష చక్రవర్తి
- అభినవ పోతన
- ఆంధ్ర కవివతంస
- మధురకవి
- కవికోకిల
- కవిశిరోవతంస
- డాక్యుమెంటరీ
- శతజయంతి
ఇతడు క్షయవ్యాధి పీడితుడై మైసూరులో 1949 - 1953 ల మధ్య చికిత్సపొందాడు. ఇతని ఊపిరితిత్తులకు పది సార్లు శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తీసివేశారు. ఒక ఊపిరితిత్తితోనే కడదాకా జీవించాడు. 1984 అక్టోబర్ 31 న మరణించడం జరిగినదజరిగింది.వీరిని ప్రతి ఒక్క కవి,రచయిత స్పూర్తి గా తీసుకుని రచనలు చేయాలి.వారిని వారి సేవలను స్మరించుకుంధాం.
రావుల రాజేశం,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
జమ్మికుంట,కరీంనగర్ జిల్లా..
9848811424