Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్ర్య సంగ్రామంలో
అసమాన త్యాగమూర్తి..
క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే సత్తా మన దేశానికి ఉందని చాటిచెప్పిన 'ఉక్కు మనిషి!'..
రాచరిక సంస్థానాలన్నింటిని
తన వాక్చాతుర్యంతో..
రాజసంగా విలీనం చేయించిన రాజనీతిజ్ఞుడు..
దేశాన్ని ఏక ఖండంగా మలచిన
జాతీయ సమైక్యతా సారథి..
రైతు శ్రేయస్సే దేశ ప్రగతి కిసాన్ ఉద్యమం నడిపిన భారత తొలి ఉప ప్రధాని,
తొలి హోం శాఖామంత్రి..
నవభారత నిర్మాణ రూపశిల్పి..
జాతీయైక్యతా పితామహుడు,
స్వాతంత్ర్య సమరయోధుడు, నిఖార్సైన దేశభక్తుడు మన భారతీయులు ఎంతో గర్వంగా 'బిస్మార్క్ ఆఫ్ ఇండియా' అని పిలవబడే
భారత రత్న శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్..మేరు నగధీరుడు..సదా చిరస్మరణీయుడు!
- సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.