Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తులసిమొక్క ఎక్కడ ఉన్నా పవిత్రమే
పారిజాతంలో దాగని పరిమళం
పుట్టుక ఎక్కడైనా ఇలనవతరించే కారణజన్ములు!!
అతి చిన్న స్థాయి నుండి
అత్యున్నత స్థాయికి ఎదిగిన
దేశ ప్రథమ పౌరుడా!
భారత రత్నమా!!
చిరునవ్వు నీ ఆభరణం
మాటలే నీ శాంతి రణం
నిరాడంబర మూర్తివి!
మానవతా దీప్తివి!
అగ్నికి రెక్కలు తొడిగి
యువత మనసులో
చైతన్య కాంతులు వెదజల్లిన
సూర్య తేజానివి!!
ప్రపంచ జీవిత పుస్తకంలో మనకో పేజీ వుండాలన్నావు
కానీ వల్లభాయ్ పేజీ కాదు పుస్తకమే అయ్యావు!!
కలలో విహరించటం కాదు కల నెరవేర్చుకోవాలన్నావు
కష్టపడి పనిచేస్తే
పదవులు పదోన్నతులు
అవే వెతుక్కుంటూ
వస్తాయన్నావు!!
సాంకేతిక రంగాల్లో
బోధనాంశాల్లో బతుకు బాటను చూపినహొ
నిత్య కర్మ శీలివి
నిత్య శోధన శాలివి!!
ఎల్లలు లేనిది
నీ ఆలోచన
ఎల్లలు లేనిది నీ ప్రేమ!!
ఎక్కడ ఢిల్లీ?
ఎక్కడ నీ గల్లీ?
నీవు లేని చోటు లేదు
నిన్ను తెలియని వారు లేరు!!
కారణజన్ముడు వల్లభాయ్
చిరంజీవివి వల్లభాయ్
అజరామరకీర్తివి
వల్లభాయ్ సర్దార్ పటేల్ !!
- సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
సేల్ : 9573996828