Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాషోన్నతికి
సాటిలేని కృషి చేసిన
పొట్టి శ్రీరాములు..ఆంధ్ర రాష్ట్ర సాధకుడు..
'భాషా సమ్మిళిత జాతి మనదిరా!'..అని..
గళమెత్తి చాటిన మాతృభాషాభిమాని..
అడుగులు తడబడు
లేత వయసులోనే..
ఆధ్యాత్మిక భావాలు కలబోసుకున్న మానవీయుడు..
ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికై..
ఉపవాస అహింసాయుధాన్ని చేపట్టిన
సిసలైన గాంధేయవాది..
అమరజీవి స్వాప్నిక ఆత్మార్పణ ఫలితమే.. ఆంధ్రరాష్ట్ర అవతరణం..! సదా స్మరణీయం..!!
- సుజాత.పి.వి.ఎల్.