Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాడు రాజకీయం..
ప్రజాసేవకు ఓ మార్గం..!!
నేటి రాజకీయం..
అధికారదాహపు చదరంగం..!!
నిత్యరణరంగం..!!
ఎవరైనా రాజకీయంలోకి
రావాలంటే రాజ్యంగాన్ని
అణువణువునూ
అవపోసనపట్టాలి..!!
ఆలోచనకు పదును పెట్టాలి..!!
ప్రతివ్యక్తినీ పట్టిచూడాలి..!!
రాజకీయమంటే..
వారసత్వసంపద కాదు..!!
ఒకరిఇంటి పేరు కాదు..!!
ఒంటి కేసుకొన్న కోటు కాదు..!!
రాజకీయమంటే...
దేశం మీద భక్తి..యుక్తి..!
నేర్పు..ఓర్పు కలబోసుకొన్న
మహోన్నత
సజీవ చిత్రం..!!
అదొక శక్తివంతమైన
భావ విచిత్రం..!!
అర్థం చేసుకొంటే ఆనందం..
అర్థం చేసుకోలేకపోతే..
అంతా వ్యర్థం..!!
రాజకీయంలో రాణించాలంటే... ముందుగా సమాజాన్ని
లోతుగా పరిశీలించి
తెలుసుకోవాలి...!!
ప్రజల బ్రతుకుల్లోని
బాధల చీకట్లను తట్టిచూడాలి..!!
పల్లె..పట్నం అన్న తేడాలేని ఏకత్వభావంతో వారి నాడిని పట్టుకోగలగాలి...!!
విశాలమైన
హృదయముండాలి..!
విశ్వాన్ని ఆకళింపు
చేసుకొనే నేర్పు ఉండాలి..!!
అందరినీ హృద్యంగా
ప్రేమించే తత్వముండాలి..!!
అందరినీ ఆదరించే విశిష్ట
వ్యక్తిత్వముండాలి..!!
స్వల్పదృష్టి..అల్పబుద్దిధోరణి
ఉండకూడదు..!
దాగుడుమూతలకు..దాపరికాలకు అసలే తావుండకూడదు...!
మనసంతా మానవత్వమే మూర్తీభవించి ఉండాలి..!!
నలుగురికి మేలుచేయాలన్న సుగుణముండాలి..!!
ప్రజాస్వామ్యం ఎప్పుడూ
ప్రజల సొత్తు..!!
ఓటు అనే ఆయుధంతో
నచ్చిన నాయకుని ఎన్నుకొనే
స్వచ్చమైన రాజమార్గం..!!
నాయకుడన్నవాడు
విలువలు కలిగి ఉండాలి..!
ఆత్మీయతను పంచేవాడుగా..
అనురాగం చూపేవాడుగా.. నిజాయితీగా.. నిర్భీతిగా
న్యాయానికి కట్టుబడి... ఆదర్శప్రాయుడై..
నలుగురినీ తనతో నడిపించగల
సత్తా కలవాడై ఉండాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801