Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నమ్మి నెత్తినకెత్తుకుంటే ...
నట్టేట ముంచుతున్నరు
ఆదరిస్తరని "పీఠం" కట్టబెడితే ...
బతుకుల నిలువునా కూలుస్తున్నరు
రైతు సంక్షేమ పేరిట ….
వన్ నేషన్ వన్ మ్యాన్ అంటూ
అలవికాని బిల్లులు తెస్తూ...
రైతు నోట్లో మట్టి కొడుతున్నారు
ప్రగతి పేరిట.. ప్యాకేజీల వంకన
అలవికాని చట్టాలకు రూపులద్ధి
సామాన్యుని పొట్ట గొడుతున్నరు
ఇంకానా....?
నిరంకుశ చేష్టలు సహేంచేది లేదంటూ...
జన గళం పోరు శంఖం పూరించింది
ఊళ్ళు ఉద్యమ బాట పట్టినయి
రాజ్యంపై యుద్దానికి సన్నద్ధమైనయి
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ….
నిరసన సెగలు విస్తరిస్తున్నయి
జన ప్రభంజనం వెల్లువెత్తుతోంది
దేశాధినేతలారా …!
ఇకనైనా మీ వింత వైఖరి విడనాడి
రైతు సంక్షేమానికి పాటు పడండి
బడుగు బతుకు మార్చ యత్నించండి
కాదు...కూడదు అంటే
జనాగ్రహ జ్వలల్లో మీరూ..
మీ రాజ సౌధాలు కాలి కూలుట తథ్యం!
- సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
సేల్ : 9573996828