Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబ మనే కోవెలలో
వెలసిన దేవత గృహిణి
ఆ కుటుంబానికి ఆమెయే మహారాణి !
పెండ్లయినాక ఇంటి పేరు మార్చుకుని
తన ఇంటి వారిని వదులుకుని
నమ్మకం తో పరాయి ఇంటికి చేరుకొని
ఆ కుటుంబానికి వంశోధారకుడ్ని అందిస్తూ
ఆ కుటుంబ సభ్యులను తనవారిగా చూసుకుంటూ
పతికి సతియై
సంతతికి తల్లి యై
అత్తమామలకు సేవకురాలై
అందరికి తలలో నాలుకయై
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షిణి యై
కుటుంబ గౌరవ సంరక్షిణి యై
సంసార నౌకకు దిక్చుచి యై
మానవతా విలువలను ప్రసరించే జీవనజ్యోతి యై
సర్వ సౌఖ్యాలను అందించే గృహలక్ష్మి యై
తను క్రొవ్వొత్తి లా కరుగుతూ
కుటుంబానికి వెలుగులు పంచుతూ
తన ఆశలను, ఆశయాలకు తిలోద కాలిస్తూ జీవన పోరాటం సాగిస్తుంది
గృ హ జ్యోతి యై నిలుస్తుంది !.
ఆమె ఓ మనిషేనని గుర్తించి
ఆమె మనసెరిగి మసలుకునే
కుటుంబ సభ్యులుంటే
అవుతుంది ఆ కుటుంబం ఓ
ఆనంద నిలయం
అవుతుంది ఆ గృహిణి మనసే ఓ నందన నిలయం !
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు
7416638823
allanageswararao1965@gmail.com