Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వ్యవస్థలో
మన అందరిని
అవ్యక్త ఆవేదన చుట్టేసింది...
నిండుకున్న రోదన కట్టి పడేసింది...
తెలియని దిగులు
మనసును నలిపేస్తోంది..
కనిపించని..వినిపించని
బాధ ఏదో కమ్మేసింది...
నెత్తురు నిండిన గాయల మధ్య నిద్రావస్థ... ఈ మేలిముసుగులు
ఎన్నాళ్ళు??ఎన్నేళ్ళు??
ఈ మూగతనం...!! ఈ ముసుగుతనం...!!
ఉద్వేగభరిత సమస్యల
మధ్య ఊగిసలాట...
ఇంకా ఎన్నాళ్ళు?? ఈ భ్రమ...!!
శోకమే.. ఓ దారావాహికగా సాగుతోంది..!!
ఎన్నేళ్ళు?? ఈ కృత్రిమ ప్రేమలు..!!
దుఃఖపు స్మృతులు..!!
తడబడుతున్న మాటలు
తల్లడిల్లుతున్నా... మానవత్వం
పెనుగులాడుతున్నా... ప్రేమలు కోల్పోతున్నా... మంచితనం
కనిపించకుండా
జారిపోతున్న మనిషితనం..!!
కల్పించుకున్న చదరంగంలో....
కలుషితమవుతున్న మనిషితనం...!!
జీర్ణించుకోలేని బాధలు..
జ్ఞాపకాల గునపాలై
గుండెను పొడుస్తున్నాయి...
మనిషి పాత్ర పవిత్రమైనది...
అది ఎప్పుడో విడిచిపెట్టాడు...
స్వప్నాలన్నీ శాపాలై శపిస్తోంది..
ప్రతి నిత్యం ఏదో ఓ అకృత్యం...
అంతుపట్టని వికృతం..
అన్నీదారుల్లో దగా..దగానే..!!
సగటు మనుషుల ఆర్తనాదాలే..!!
ప్రతిఇంటి గుమ్మానికి
ఏదో తెలియని సమస్యల తోరణాలే..!!
ఈ వ్యవస్థ ఓ పద్మవ్యూహం..!!
అవస్థలు చుట్టేయక ముందే
అందరూ జాగ్రత్త పడాలి..
ఇదో గమ్యం తెలియని గమనం...
ఎటుపోతుందో..!!?? తెలియదు...!!
ఏదో అగాధంలోకి పోయినట్లు
దయనీయ క్షణాలు దారి తప్పిస్తాయి...
రోజులు మారుతున్నాయి..
పరిస్థితులు మారుతున్నాయి..
నిరంతరం ఏదో వత్తిడి..!!
వెంటాడుతూనే ఉంటుంది...
ఈ వ్యవస్థలో అవస్థలు తప్పవు....
అంబటి నారాయణ
నిర్మల్
9849326801