Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడుగుపెడితే గొడుగు పడతా
అన్నట్లుండే తరువులు
ప్రతి రహదారికి ఇరువైపులా ఉంటే
ఆ ప్రకృతి రమణీయంతో, పచ్చదనంతో
చల్లని నీడలో పయనిస్తుంటే
అదికాదా గుండె నిండిన న్యాయం !!
స్వార్థం, అసూయ, ద్వేషాలను త్యజించి
ప్రతివారూ సక్రమంగా ఆలోచించి
ధర్మమార్గంలో పయనిస్తే
అదేకదా గుండె నిండిన అన్యాయం!!
ప్రతి పురుషుడూ
పర స్త్రీని తల్లిలా భావిస్తూ
అర్థరాత్రి సైతం
మహిళ నిర్భీతిగా నడిచేందుకు
భరోసా ఇస్తే
అదే అసలైన మది నిండిన ధర్మం!!
అన్నం పెట్టే రైతుకు రక్ష కల్పించి
సకల సౌకర్యాలు సమకూర్చి
వ్యవసాయాభివృద్ధికి సహకరిస్తే
అన్నపూర్ణగా దేశాన్ని మార్చేస్తే
ఇదే అసలైన ప్రగతి న్యాయం !!
ఓటేసేందుకు ప్రలోభాలకు లొంగక
నీతిగల నేతకై పాటుపడితే
ప్రభుత్వాలు సైతం
ప్రజలను ఉచితాల ఊబిలోకి నెట్టక
ఉపాధి అవకాశాలను మెరుగు పరచి
నిజమైన అభివృద్ధికి ఊతమిస్తే
గాంధీజీ కలలకు రూపమిస్తే
అది ప్రగతి బాటకు
మన భరతమాతకు
మనసు నిండే ప్రగతి దుర్మార్గులు!!
ఈ ప్రగతి న్యాయలు సాకారం చేసేందుకు
విశ్వ విపణిలో
మన దేశాన్ని విశ్వ విజేతను చేసేందుకు
మనమందరం అంకితభావంతో
మనవంతుగా కృషి చేద్దాం.
ఉమ్మడిగా
ప్రగతి ఫలాలను అనుభవిద్దాం ధర్మంగా!!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828