Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ అదేవిధంగా సమీప ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలు, వాటిని కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేదాజ్ఞలు ఇవాళ అర్థరాత్రి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు ఎన్జీటీ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఒకవైపు వాయు కాలుష్యం పెరుగుతుండటం మరోవైపు కరోనా వైరస్ కేసులు అధికమౌతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 7,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.