Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చాలా తక్కువ సమయంలో పెద్ద స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అండతో గత ఏడాది అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిపోయాడు. అతను హీరోగా ఒకటికి మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి చడీచప్పుడు లేకుండా పూర్తయిపోయింది కూడా. ఆ సినిమా పేరు.. 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించాడు. నేడు ఈ చిత్రంలోని 'గుంటూరు' లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరి నుంచి గుంటూరు సిటీకి వెళ్లి అక్కడ హోటల్ వ్యాపారం చేయాలని ఆశపడే కుర్రాడి కథ ఇది. అక్కడ ఎంతోమంది ఉండగా.. వాళ్ల పోటీని తట్టుకుని నిలబడ్డం కష్టం కాదని నాన్న అంటే, అమ్మ ప్రోత్సాహంతో గుంటూరుకు వెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టి హీరో ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో సాగే కథ ఇది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ఆనంద్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది.