Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మక్క,సారలమ్మ జాతర కాదు ఇది
వన దేవతలకు అర్పించే బెల్లం గడ్డ లు కావు ఇవి
అన్నం పెట్టే రైతుల దీన గాద ఇది
ఆరు కాలం కష్టాన్ని ట్రాక్టర్ ట్రక్కు లో మోసుకు పోతున్న రైతులం
వన జాతరలాగా వరుస కట్టిన రైతుల కష్టం
సన్నాల సాగుల ఆర్డర్ తో మేము సన్నాసులైనాము
ఎండ మాముల ఎదురు చూపులతో ఆవిరైన ఆశలు
రైతు నెత్తిన గోమారిలా ప్రభుత్వ అలసత్వం
మా కష్టాల,నష్టాల నోటికాడి మెతుకులు రోడ్డు పాలాయే
వరుసలు కట్టిన ధాన్యపు గింజల బండ్లు
దిగాలు పడ్డ నేతన్నల కడగండ్లు
ఇప్పుడు ఇవ్వండి రైతులకి బిర్యాని పొట్లాలు,మద్యం సీసాలు
ఇది రాజకీయ పార్టీ సమూహ బల ప్రదర్శన అని
ఇప్పుడు ఎసుకో వాహనాల హాజర్ పట్టిక
ఇప్పుడు పోస్తాం రైతులమ్ మంత్రుల చిత్రపటాలకు
పాలాభి శేకాలు కాదు
వేసేది మంత్రుల చిత్రపటాలకు పూల దండలు
ఫోటో ముందర అగరు వత్తులు
ఇప్పుడు చేస్తాము పదవ రోజున ఘణ కార్యములు
కానీ ....
రైతు మనసు వెన్న పూస
దేశానికి అన్నం పెట్టే రైతులం
కష్టాన్ని ,సుఖాన్ని కడుపులో దాచు కునే వాళ్ళం
మీరు అవునన్నా,కాదన్నా, అందరకీ కడుపు నిండా అన్నం పెట్టే రైతు లం మేము.
చలోజు హ రిందర్
నల్గొండ,8688260214