Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంబటి...నీ వెంబటి ఎవరు?
నేను ఊహించిన వారు!
నా ఊహలో ఉన్నవారు!
నా ఊపిరై పలికినవారు!
నాకు ఊతమై.. నిలిచినవారు!!...
నాయెద గుమ్మాల ముందు
పడిగాపులు కాసేవారు..
నా మనసు అరుగుల మీద
ఆసీనులైనవారు...
చూడకుండా ఉండలేని వారు..
చూస్తూ ఊరుకోలేని వారు...
అనునిత్యం ఆరాధించే వారు..
ప్రతి నిత్యం పలకరించేవారు...
చూపులతో పట్టేసి
మనసుతో కట్టేసేవారు...
ఎన్నెన్నోరూపాలతో
అగుపించేవారు...
కొలిమి రాజేసి పదాలకు సానబెట్టించి..
భావాలకు పదును కల్పించి...
తెగించి తిరగబడ్డ సాహసం నింపి
ప్రతి విజయానికి
ఓ విషయమై నిలిచినవారు..!!
కష్టానికి కన్నీళ్ళకు
తోడై నిలిచే వారు..
నీడై వీడని వారు...
నమ్మించి మనసు పెట్టించి
పని చేయించే మనుషులు...
లక్ష్యాన్ని చూపించి
అనుకున్న తీరాన్ని చేర్చే వారు..
నేను అంబటినే... మొదటి
అక్షరాన్ని..ఆదిని..
నేనొక ఆత్మీయ ప్రేమికున్ని..
నాదొక ప్రకృతి ధర్మం..
ప్రపంచం నా ఆసనం..
ప్రకృతి నా శాసనం...
ఈ వ్యవస్తే నా సింహాసనం...
నిత్యం అవస్థల మీద యుద్ధం...
అట్టడుగు బతుకులమీద
నా కవిత్వపు సంతకం...
అప్పుడప్పుడు
పుడమి పొత్తిల్లో ప్రకృతి చెక్కిళ్ళమీద...
కవిత్వపు శ్రీకారం చుడతా!!...
కాలం గుండెలో ఉంటూ..
సమాజంలోని నిజమైన
గుట్టును బయట పెడతా!!..
జరుగుతున్న అన్యాయాలపై
ధ్వజమెత్తి కలం ఎక్కుపెడుతా!!...
మోసాలకు ద్వేషాలకు
జరిగే అవమానలకు
అక్షరాల అడ్డుకట్టవేస్తా!..
ఈ అంబటి మీ వెంబటే
నిత్యనూతన వెలుగై ఉంటాడు...
ఇదే అంబటి ప్రేమ మార్గం!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801