Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి రెప్పల్లా
జగతికి సూర్య చంద్రుల్లా
పర్యావరణ పరిరక్షణకు వృక్షాల్లా
దేశ సంరక్షణకు జవాన్లు అలా !
ఉన్నత చదువులు చదవ కున్నను
ఉన్నతాశయంతో సైనికులుగా చేరి
దేశరక్షణే పరమావధిగా
తను కన్నవారికి
తనను కన్నవారికి
కడకు కట్టుకున్న వారికీ
దూరంగా ఉంటూ
ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ
శత్రుదేశ సైనికులతో
వీరోచిత పోరాటం కొనసాగిస్తూ
దేశం మన కేమిచ్చిందని ఆలోచించక
దేశానికి మనమేమిచ్చామని ఆలోచిస్తూ
దేశ సరిహద్దల్లో ఎదురు కాల్పుల్లో ప్రాణాలొడ్డిన
వయ కిశోర జవాన్లకు విప్లవాభి వందనములు !
ఆళ్ల నాగేశ్వరరావు
గుంటూరు
7416638823
ఇమెయిల్ : allanageswararao1965@gmail.com