Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మనుషుల మధ్య ప్రేమ
అంతా స్వార్థపూరితం!!..
తృప్తిలేని జీవితాల మధ్య
పుట్టే ఆత్మీయత
అంతా అవసరార్థం!!..
పరులకోసం
బతికే మనిషి
ప్రశ్నార్ధకం!!...
నిస్వార్థ మానవుడు
ఈ కలియుగాన
జన్మించడం అసంభవం!!...
మనిషే ఓ సమస్య!!...
తనకు తానే ఓ ప్రశ్న!!...
ఒకసారి తానో అంకురం!!..
ఒకసారి తానో అంకుశం!!..
కల్లోలం.. ఓ విస్పోటనం..
ఓ ప్రచండధ్వని..ఓంకార నాదం!!...
నేడు స్వార్థ పరత్వంతో..
సప్తవ్యసనలోలుడై...
దురాశతో అన్నీ మరిచి..
అహం బ్రహ్మాస్మి నంటూ..
భ్రమలో జీవితాన్ని
గడుపుతున్నాడు...
తనకు తానుగా..
ఒంటరిగా నడుస్తున్నాడు..
తరాలు మారుతున్నా..
తన అంతరంగాన్ని...
మార్చుకొనడం లేదు..
సంప్రదాయాలను విడనాడి.
ఆధి పత్య ధోరణితో...
దానవుడిగా మారాడు...
ఎన్ని తపస్సులు చేస్తేనో..
లభించే మానవ జన్మ ను..
తుచ్ఛ ఐహిక సుఖాల
వలయంలో పడి...
అసూయా ద్వేషాలతో...
పాప పంఖిలమై....
తనమరణాన్ని తనే
లిఖించు కుంటున్నాడు...
నానాటికీ ఆధునికత...
శాస్త్రీయత పేరుతో...
విలువలకు తిలోదకాలిచ్చి...
ప్రకృతిని కాలరాస్తూ...
ఈ జీవన నాటకంలో...
తన పాత్రను తానే
"భస్మాసురుడు"గా మలచుకొని
రుద్రభూమి బాట పడుతున్నాడు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801