Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైశాచికత్వం "పడగ" విప్పుతోంది
రాక్షసానందం "సెగలు" గక్కుతోంది
సాటి మనిషి రక్త మడుగులో
గిలగిలా తన్నుకు చస్తున్నా ...
చలించని బండరాయితనాలు
వెంటాడి హతమారుస్తున్నా...
పట్టనట్లుండు నిర్లక్ష్య వైనాలు
ప్రేమోన్మాది పెట్రోలు దాడికి
మంటల్లో సజీవ దహనమౌతున్నా ...
ప్రేక్షక పాత్ర పోషించు వైఖరులు
క్షతగాత్రుల కేకలు మిన్నంటుతున్నా ...
బ్రహ్మ చెవిటిగా నటించే తత్వాలు
హత్యలు ... మానభంగాలు
ప్రమాదం,విషాద ఘటనలు
కళ్లెదురుగా జరుగుతున్నా….
కనీస స్పందన మాట అటుంచి
చరవాణిలో బందించే కుయత్నాలు
సామాజిక మాధ్యమాలకు ఎగజల్లి …
ఏదో ఘనత సాదినంత సంబురాలు
మనిషిగా పుట్టిన ఓ మనిషి…!
ఇకనైనా బాధితుల పట్ల …
కాస్త కనికరం చూపిస్తే ..
ఆపన్న హస్తం అందిస్తే ...
సత్వర సమాచారం చేరవేస్తే..
మలిగే ప్రాణ "దీపాలు" వెలుగుతాయి
ఆజన్మాంతం నిను తలుచుకుంటాయి
సబ్బు నాగయ్యప్రజాకవి
రాజుపేట
సేల్ 9573996828