Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజీ
కాలాలెన్నిమారినా
కలకాలం లోకంలో
శాశ్వతం ఆయన సంతకం
నిజమే ఆయన నైజం
నిక్కచ్చిగా నిర్భయంగా
చాటెను మానవత్వం
పేదవాడే ఆయన హీరో
దోపిడిదొరలపై
అక్షరాయుధాలతో
దండెత్తిన యోధుడు
ఆకలి కేకలను ఏకరవెట్టాడు
చమటచుక్కలను ఎత్తిపట్టాడు
అన్యాయాలపై సమరశంఖం పూరించిన ధీరుడు
సామాన్యుడిగ జీవనం
లోకమంతా తెలిసినా
తెలంగాణ ఆయన జీవనం
యాసనే శ్వాసగా గమనం
కవిలోకంలో ఆయన అక్షరాలు
ఆకాశంలో చుక్కల్లా శాశ్వతాలు
తెలంగాణ అస్థిత్వం నిలబెట్టిన కవిత్వం
కాళోజీకే సొంతం
- సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.