Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేషం నిరంకుశ శిశిరంలా..
సరిహద్దుల్లో ఉన్మాదం ఉప్పెనై..
ప్రాణాలను కబళిస్తుంటే..
మేమిక్కడ పండగెలా జరుపుకుంటాం..?
దేశం కోసం ప్రాణాలను సైతం లెఖ్ఖ చేయక..
తమ ఊపిరిని
మాతృదేశానికి రక్షణ కవచంగా మలచి..
మృత్యువు ఒడిలో
నిలబడి ప్రాణ దీపాలను అర్పిస్తూ..
శతృ సైనిక తూటాలకు బలై..
విగత జీవులైన వీర జవానుల్లారా..
పండగెలా జరుపుకుంటాం..!
దేశం కోసం మీరు అర్పించిన
ప్రాణాలు
నింగిలో దీపాలుగా దేదీప్యమానమై వెలుగుతూనే ఉంటున్నాయి..
వేరే దీపావళి ఎందుకు?!..
మీవంటి ధీరులను గన్న వీరమాతల జన్మ ధన్యం..
వారి పాదాలకు మనస్ఫూర్తిగా ప్రణమిల్లటం తప్పా! ..
ఏమిచ్చినా మీ ఋణం తీరదు.!!
--సుజాత.పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్, 7780153709.
(ఇటీవల దేశం కోసం ప్రాణాలర్పించిన మహేష్ కి ఈ కవిత అంకితమిస్తూ..)